Thursday, June 18, 2020

పది దుల్ హజ్జ్ (హజ్ నెలలో మొదటి పది రోజులు) చేయవలసిన విధులు (పనులు)

 ప్రార్థన  (సలాత్-నమాజ్ ) ఫర్జ్ నమాజ్ కోసం తొందరపడటం మరియు నవాఫిల్‌ను వీలైనంత ఎక్కువగా చదవటం (ప్రార్థించటం) ద్వారా  సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌తో సన్నిహితంగా ఉండటానికి ఉత్తమమైన మార్గం సుగమం అవుతుంది మరియు ముస్తాహాబ్ కూడాను . సోబాన్ (రజిఅల్లాహుతాల ) ఇలా వివరించారు : నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా ఇలా వినడం జరిగింది.  అల్లాహ్ కు తరచూ సజ్దా చేయడం మీ యొక్క విధి, ఎందుకంటే మీరు అల్లాహ్ కు సజ్దా చేస్తే, అల్లాహ్ మిమ్మల్ని ఉన్నత స్థానా లు ప్రసాదించి  మీ  పాపములను  తొలగిస్తాడు. (ముస్లిం)
మరియు ప్రతి సమయంలో ఇలాగే జరుగుతుంది.


ఉపవాసం  (రోజ) ఇది మంచి పనులలో చేర్చబడింది. 
హనీదా బిన్ ఖలీద్ వివరించిన హదీసు ఏమిటంటే,
 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 ధుల్-హిజ్జాలో (హజ్ నెలలో ) తొమ్మిది మరియు అశురా మరియు
 ప్రతి నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.
(అహ్మద్ అబూ దావుద్, నిసాయి ) 

తక్బీర్  (అల్లాహుఅక్బర్), తహెలీల్  (లా ఇలాహా ఇల్లా అల్లాహ్), 
తహ్మిద్  (వలిల్లహిల్ హమ్ద్) వీలైనంత వరకు ఎక్కువగా పఠించాలి.
ఇమామ్ బుఖారీ (రహమతుల్లహి అలయ్) ఇలా అంటా రు:
ధుల్-హిజ్జా యొక్క మొదటి పది రోజులలో, ఇబ్నే ఉమర్ మరియు
 అబూ హురైరా (రజిఅల్లాహుతాల ) బజార్ లో వెళ్లే ప్రతి సారి
తక్బీర్ పఠిస్తూ వెళ్లేవారు , మరియు ప్రజలు తమ తక్బీర్తో పాటు
తక్బీర్ కలిపేవారు (కలిసి పఠించే వారు). మరియు ఇలా కూడా ప్రవచించారు
 ఉమర్ (రజిఅల్లాహుతాల) వారు తన గుడారంలో నుండి బయటికి
 వెళ్ళేటప్పుడు తక్బీర్ పఠనం చేస్తూ బయటికి వెళ్లేవారు. 
అది విని మస్జిదులో ఉన్న వారు మరియు బజారుల లో ఉన్న 
అందరు తక్బీర్ పఠనం చేసే వారు అందరు కలిసి పఠనం 
చేయడం ద్వారా ఆ ప్రాంతమంతయును తక్బీర్ తో మారుమోగేది.
  కాబట్టి, ముస్లింలైన మనం కూడా ఈ యుగంలో వాడుకలో లేని ఈ సున్నత్
 ను పునరుద్ధరించాలి.
 
 
 
 
అరాఫా రోజు ఉపవాసం
'అరాఫా రోజున ఉపవాసం గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 ఇలా అన్నారు: గత సంవత్సరం మరియు రాబోవు సంవత్సరం 

(రెండు సంవత్సరాలు) చేసిన పాపాలను అల్లహ్ క్షమిస్తాడని నేను
 నమ్ముతున్నాను. (ముస్లిం).
 హజ్ చేస్తున్న వ్యక్తికి 'అరాఫా యొక్క ఉపవాసం సిఫారసు చేయబడలేదు, 
ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేస్తున్నప్పుడు 
 అరాఫా రోజున ఉపవాసం చేయలేదు.

Thursday, April 9, 2020

రంజాన్ ను ఎల స్వాగతించాలి

  1. అల్లహ్ తో క్షమాపణ మరియు పాపముల (గున) పై పాశ్చాతాపం.
  2. ఉపవాసం యొక్క నియమ నిబంధనములను తెలుసుకుంటూ. 
  3. రంజాన్ లో మొత్తం సమయాన్ని మంచి మరియు పుణ్య కార్యములతో  గడపడానికి ప్రణాళిక. 
  4. రంజాన్ లో బద్ధకం మరియు సోమరితనానికి దూరంగా వుంటూ, మంచి పనులు మరియు పుణ్య కార్యములకై కష్టపడుతు.
  5. అల్లహ్ కు ధన్య వాదములు తెలుపుతూ రంజాన్ నెల మనకు లభించినందుకు.

రంజాన్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆచారాలు /ప్రక్రియలు

  • రంజాన్ లో  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చాలా ఎక్కువగా ప్రార్థనలు చేసే వారు, వీరు దైవ దూత జిబ్రాయిల్ తో కలిసి ఖురాన్ పారాయణం చేసేవారు. 
  • అల్లాహ్ మార్గం లో ఎక్కువగా ఖర్చు చేసేవారు. 
  • ప్రజల పట్ల ప్రేమగా / దయగా వుండే వారు. 
  • ఖురాన్ పారాయణం / చదవటం చేసేవారు ప్రార్థనలు / నమాజ్ ఎక్కువగా చేసేవారు ఎతేకాఫ్ లో కూర్చుండే  వారు. 
  • ఇతర నెలల కంటే ఈ నెలలో ఎక్కవగా ఆరాధన / ఇబాదత్ చేసే వారు.

రంజాన్ లో ఏమి చేయ వలెను 

  • మరింత ఎక్కువగా ప్రార్థనలు / ఆరాధనలు చేయాలి. 
  • పాపములకు దూరంగా ఉండాలి. 
  • 5 పూటల నమాజ్ జమాత్ తో చేయాలి. 
  • అబద్దాలు మాట్లాడ కూడదు 
  • ఎవరి గురించి చెడుగా  మాట్లా కూడదు / ఎవరికీ చెడు చేయ కూడదు. 
  • ఎవరికీ మోసం చేయ కూడదు 
  • మరియు అన్ని రకాల నిషేదించ బడిన  (హరామ్) పనులు /  మాటలు (చర్యలు/విషయాలు) మానుకోవాలి. 

ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లం) వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా ఉపవాసం / రోజా వుంది కూడా అబద్దాలు చెప్పడం, వాటిని అమలు చేయడం వదులుకోకపొతే ఆ వ్యక్తి అన్న పానీయాలు వదిలి పెట్టడం పట్ల దేవునికి / అల్లాహ్ కు ఎలాంటి ఆసక్తి ఉండదు. (సాహి బుఖారి 1242 ఉపవాస ప్రకరణం). 

ముఖ్యాంశాలు :

    ఉపవాస వ్రతాన్ని పాటించే వారు దాని ఆశయాలను కూడా నెరవేర్చాలని ఈ హదీసు యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపవాసం చేసేవారు ఒక వైపు దైవ ప్రసన్నత కోసం కృషి చేస్తూ, మరో వైపు దైవా గ్రహానికి దారి తీసే అధర్మ కార్య కలాపాలకు కూడా దూరంగా ఉండాలి. లేని పక్షంలో అలాంటి ఉ ఉ పవాసం వుండే వారికి ఎలాంటి పుణ్యం లభించదు. పైగా ఉపవాస స్థితిలో ఉండి  కూడా  ధర్మ విరుద్ధమైన చేష్టలకు పాల్ప డినందుకు పాపాన్ని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. (వారి ఉపవాసం పట్ల అల్లహ్ కు ఎలాంటి ఆసక్తి ఉండదు) అంటే వారు ఉపవాసాన్ని మానేసి తినటం త్రాగటం మొదలు పెట్టాలని అర్థం ఎంత మాత్రం కాదు. ఇదొక హెచ్చరిక. వారు తమలో దైవ భీతిని పెంపొందించుకొని చెడుకు దూరంగా ఉండాలనేదే దాని ఉద్దేశం.


 రంజాన్ యొక్క సద్గుణాలు

  1. ఇదే నెలలో ఖురాన్ గ్రంథం వెల్లడయ్యింది. 
  2. ఇదే నెలలో జన్నత్ / స్వర్గం యొక్క అన్ని ద్వారాలు తెరవ బడతాయి. 
  3. జహాన్నుమ్ / నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి.
  4. షైతాన్ / దయ్యం కట్టవేయ బడుతుంది. 
  5. ఇదే నెలలో షబేఖదర్ వుంది ఒక్క రాత్రి వెయ్యి నెలల కన్నా విలువైనది. 
  6. ఎవరైతే సరియైన ఉద్దేశంతో పూర్తీ విశ్వాసంతో ఉపవాసం వుంటారో అతని మునుపటి పాపాలు క్షమించబడతాయి. 
  7. అదేవిధంగా ఈ నెలలో తరావి చదివితే పాపములు క్షమించబడతాయి. 
  8. ఎవరైతే ఈ నెలలో వచ్చే షబేఖదర్ అనే రాత్రి జాగారం/ఇబాదత్ చేస్తారో వారి పాపములు క్షమించబడతాయి. 
  9. ఈ నెలలో చేసే ఉమ్రా ప్రతిఫలం హజ్ కు సమానం. 
  10. ఈ నెలలో చాలా మందికి నరకం నుండి స్వేచ్ఛ లభిస్తుంది. 
  11. ఒక దైవ దూత కేక వేసి చెప్పడం జరుగుతుంది పుణ్య కార్యం / నేకి చేసే వారు ఇంకా ఎక్కువ కష్టపడండి, పాపులారా ఇక మీ పాపములను వదిలెయ్యండి. 
  12. ఉపవాసం ఉండేవారికి అల్లహ్ కృప లభిస్తుంది. 


రంజాన్ సందర్భంగా జరిగే కొన్ని తప్పులు 

  1. ఆహారపానీయాల కోహం వృధా ఖర్చులు పెట్టడం. 
  2. రోజంతా పడుకోవడం, రాత్రంతా మేల్కొనడం. 
  3. టీవీ మరియు మొబైల్ కోసం సమయం వృధా చెయ్యడం. 
  4. ఇఫ్తార్ ఆలస్యంగా  చేయడం సహర్ తొందరగా చేయడం. 
  5. ఉపవాసం ఉన్నప్పుడు త్వరగా కోపం తెచ్చుకోవడం. 
  6. చేదు ప్రవర్తనను ప్రదర్శించడం. 
  7. రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోక పోవడం. 
  8. తరావి నమాజ్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. 
  9. రంజాన్ లో మొదట ఉత్సాహంతో ప్రార్థనలు చేసి నెమ్మదిగా అలసత్వం ప్రదర్శించడం. 
  10. ఫర్జ్ నమాజ్ వదిలేసి పడుకోవడం లేదా జమాత్ తో కాకుండా ఇంట్లో నమాజ్ చేయడం. 



 



Tuesday, March 17, 2020




మానవుడు భుమి పై గ్రహాంతరవాసి...
ఆసక్తి కరమైన పరిశోధన... 
తప్పకుండ చదవండి... 

        డాక్టర్ ఎల్లిస్ సిల్వర్ (P H D) తాను వ్రాసిన Humans are not from earth అనె  పుస్తకం లొ ఒక కొత్త వాదన కు తెర తీయడం జరిగింది. మానవుడు భూమియొక్క నిజమైన నివాసి కాదు బహుశ మానవ జాతి మరొక గ్రహం పై సృష్టించబడి ఏదైన కారణాల వలన తన అసలు గ్రహం నుండి ప్రస్తుత నివాస గ్రహమైన భూమి పై విసిరి వేయబడి ఉండవచ్చు. 

        డాక్టర్ సిల్వర్, ఒక శాస్త్రవేత్తా పరిశోధకుడు మరియు అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుడు తన పదాలు పుస్తకంలో పరిశీలిస్తే ఏ ఒక మతం కు నమ్మకం లేని సైన్సు ఆధారిత పదాలుగా అనిపిస్తుంది.

       డాక్టర్ సిల్వర్, చెప్పిన దాని ప్రకారం మొదటిసారి మానవజాతి సృష్టించబడిన ప్రదేశం చాలా సౌకర్యవంతంగా V.VIP తరహాలో వుండవచ్చు వాతవరణం కూడా చాలా సౌకర్యవంతంగా వుండవచ్చు చాలా మృదువైన మరియు సున్నితమైన వాతావరణంలో నివసించిన వాడు మనిషి చాలా రుచికరమైన రక రకాల భోజనాలు చేయడం చాలా విలాసవంతమైన జీవితం గడపడం అదికూడా కష్టపడకుండ ఆఖరికి తన తిండి కొసం కూడా కష్టపడని జాతి అని తెలుస్తుంది.

బహుశా ఈ జీవి ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు.
తన పొరపాటు వలన సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన వాతావరణం నుండి విసిరివేయబడ్డాడు.
ఎవరైతే అంత మంచి తన స్వంత స్థలం (గ్రహం) నుండి మానవ జాతిని తీసివేశాడొ అతను చాలా శక్తి వంతుడు అయివుండొచ్చు బహుశా ఈ నక్షత్రాలా వ్యవస్థకంటెను బలశాలి అయివుండవచ్చు.
తాను తలచుకుంటే ఎవరినైనా ఎక్కడికైనా ఏ గ్రహం పైన సరే పంపగలడు తాను శిక్షించగలడు అతను జీవులు సృష్టించగలడు అతను మానవులను కూడా సృష్టించగలడు.

      డాక్టర్ సిల్వర్, భూమిని జైలు తో వర్ణిస్తాడు బహుశా ఇక్కడ తప్పు చేసిన వారిని శిక్షించడానికి పంపించి ఉండవచ్చు ఎందుకంటే కొద్దీ మొత్తం భూమి గుండ్రంగా  నీరు. జైలు లాంటి ప్రదేశం మనం ఊహించుకోవచ్చు. అందుకే మానవులను ఇక్కడికి పంపించడం గరిగింది.

    డాక్టర్ సిల్వర్ శాస్త్రవేత్తపరిశీలనల ఫలితాలను పొందిన తరువాత మాత్రమే అభిప్రాయాలను ఏర్పరుస్తాడు. అతని ఈ పుస్తకంలో శాస్త్రీయ వాదనలు చాలా ఉన్నాయి.అతని వాదన యొక్క ప్రధాన అంశాలపై  ఆధారపడిన కొన్ని పాయింట్లు. 

1) భూమి యొక్క గురుత్వాకర్షణకు మరియు మానవులు వచ్చిన ప్రదేశం యొక్క గురుత్వాకర్షణకు మధ్య చాలా తేడా ఉంది.
మానవుడు వచ్చిన గ్రహం యొక్క గురుత్వాకర్షణ భూమి కంటే చాలా తక్కువగా ఉండవచ్చు దీనివల్ల మానవుడికి భారాన్ని మోయడం చాలా సులభం. మానవులలో వెన్నునొప్పి యొక్క ఫిర్యాదు అధిక గురుత్వాకర్షణ కారణంగా ఉంది.

2) మానవులలో కనిపించే దీర్ఘకాలిక వ్యాధులు భూమిపై నివసించే ఇతర జీవులలో లేవు. డాక్టర్ సిల్వర్ చెప్పేది ఏమిటంటే మొత్తం భూమి మీద ఒక్క వ్యాధి కూడా లేని మనిషిని ఎవరైనా చూయించగలరా. ఒకవేళ చూయిస్తే నేను నా వాదనను ఉపసంహరించుకోగలను. ప్రతి జంతువు గురించి నేను మీకు చెప్పగలను, సమయానుకూలమైన మరియు తాత్కాలిక అనారోగ్యాలు తప్ప మరే ఇతర వ్యాధులలో చిక్కుకున్న జంతువు కనిపించవు.


3) ఒక్క మానవుడు కూడా ఎండలో ఎక్కువసేపు కూర్చోలేడు అయితే (తలా తిరగడం) మైకము రావడం మొదలవుతుంది మరియు సన్ స్ట్రోక్‌తో బాధపడవచ్చు. జంతువులలో అలాంటి సమస్యలు వుండవు.
జంతువులు ఎండలో నెలల తరబడి ఉన్నప్పటికీ ఎటువంటి తక్షణ అనారోగ్య సమస్యలతో బాధపడవు.

4) ప్రతి మనిషి నా ఇల్లు ఈ గ్రహం పై లేదు అనే భావనతోనే ఉంటాడు, కొన్ని సార్లు తనకు తెలియకుండానే ఎదో విచారంలో విదేశాలలో నివసిస్తున్న విదేశీయుడిలా ఉంటాడు తన సొంత ఇంట్లో  
రక్త సంభందీకులతో కూర్చున్నప్పటికినీ.


5) భూమిపై ఉన్న అన్ని జీవుల టెంపరేచర్ స్వయంచాలకంగా ప్రతి సెకనులో నియంత్రించబడుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ వేడికి అనుగుణంగా వారి శరీర ఉష్ణోగ్రత స్వయంచాలకంగా పెరుగుతుంది.
ఒకవేళ వెంటనే అదే సమయంలో మేఘాలు వస్తే అప్పుడు వారి శరీర ఉష్ణోగ్రత చల్లగా అయిపోతుంది అంటే మనిషి తప్ప అన్ని జీవులు శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకుంటాయి. మానవులలో అలాంటి వ్యవస్థ లేదు, మారుతున్న వాతావరణంతో పాటు మనిషి అనారోగ్యానికి గురవుతాడు.వాతవరణ మార్పు వల్ల వచ్చే జ్వరం, జలుబు మానవులలో మాత్రమే ఉంటుంది.



6) మనిషి ఈ గ్రహం మీద కనిపించే ఇతర జీవుల నుండి చాలా భిన్నంగా ఉంటాడు.మానవుడి DNA మరియు జన్యువుల సంఖ్య ఈ గ్రహం లోని ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మానవులను సృష్టించిన అసలు గ్రహం భూమి వంటి మురికి వాతావరణాన్ని కలిగి లేదు అని మరియు మనిషి యొక్క చర్మము మెత్తగా మరియు నాజుకుగా ఉండడం ఎండకు మారిపోవాడం గమనిస్తే మానవుని చర్మమం జన్మ గ్రహం ప్రకారం పరిపూర్ణంగా తయారైంది అని అర్థమవుతుంది. మానవ జాతి చాలా సున్నితమైనది, భూమికి వచ్చిన తరువాత కూడా, దానికి అనుగుణంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. తన జన్మ గ్రహం మీద సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవితం గడిపినట్టు ఇక్కడ భూమిపైకి వచ్చిన తరువాత సాధ్యమైనంతవరకు విలాసవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగంటే సుతిమెత్తని
విలాసవంతమైన మంచాలు పరుపులు, అందమైన మరియు బలమైన రాజభవనాలు (ఇళ్ళు) ఇప్పటికి అల్లాగే జన్మ గ్రహం ప్రకారం పరిపూర్ణంగా నిర్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇతర
జంతువులు మరియు జీవాలు ఇలా విలాసవంతంగా ఉండటానికి ప్రయత్నం చేయవు. ఇక్కడ భూమి యొక్క జీవులకు తెలివి అనేది లేదు అవి మంచిగా ఆలోచించలేవు మంచిగా ఉండను లేవూ. మనిషి లాగా శాంతి యుతంగా జీవించాలని కోరుకోవు. మనిషి కూడా వాటిని చూసే క్రూరత్వం అనేది నేర్చుకున్నాడు. ప్రేమ, శాంతి, సామరస్యం అనేది అసలు మానవుని లక్షణం. మానవుడు ఒక ఖైదీ లాంటి వాడు భూమి పైన అందుకే ఎలాంటి సౌకర్యాలు లేని ఒక గ్రాహం పైన శిక్ష అనుభంచడానికి  పంపించబడ్డాడు.

డాక్టర్ సిల్వర్ అభిపాయం ప్రకారం ఈ (మానవుని) గ్రహాంతర వాసి యొక్క  తెలివి మరియు పరిపక్వత ను గమనిస్తే తెలుస్తుంది తాను తన తల్లి దండ్రులను విడిచి ఇంకా ఎక్కువ కాలం కాలేదు. బహుశా కొన్ని వేళా సంవత్సరములు మాత్రమే అయి ఉంటుంది అందుకే తన పాత గ్రాహం లాగే ఇక్కడ కూడా విలాసవంతంగా జీవించాలనుకుంటున్నాడు మనిషి. అందులో భాగంగానే వాహనాలను కనుగొన్నాడు ఫోన్లు మరెన్నో విలాసవంతమైనవి, ఒకవేళా మానవ జాతి ఈ గ్రాహం పై
 వచ్చి కొన్ని లక్షల సంవత్సరాలు అయి ఉంటే ఇవి కొన్ని వేళా సంవత్రాల ముందే కనుకొనేవాడు మనిషి.
ఎందుకంటే మీరు మరియు నేను చాలా మిలియన్ల సంవత్సరాల నుండి పేలవంగా మరియు జంతువుల వలె జీవించలేదు. ఎందుకంటే మీరు మరియు నేను చాలా మిలియన్ల సంవత్సరాల నుండి  పేలవంగా మరియు జంతువుల వలె జీవించలేము.  డాక్టర్ ఎలియాస్ సిల్వర్ యొక్క పుస్తకం లో ఇలాంటి విషయాలు  చాలా వున్నాయి  మరీ  ముఖ్యంగా అతని వాదనలు అబద్ధమని ఇంకా నిరూపించబడలేదు. నేను ఈ పుస్తకం యొక్క శాస్త్రీయ వాదనలు మరియు
ఆలోచనలను గురించి గమనిస్తునంత సేపు ఈ కథ చెబుతున్నది ఒక శాస్త్రవేత్త అసలు ఇది కథ కాదు నిజమే కదా అనిపించింది. ప్రతి మతం లోని ప్రేరణాత్మక పుస్తకం వివరించేది ఇదే కదా అనిపించింది. తండ్రి ఆడమ్ అండ్ ఈవ్ కథ మన అందరికీ తెలుసు కాబట్టి నేను దానిపై వివరణ రాయ దలుచుకోలేదు.ప్రవక్తలు తమ తరాలకు
చెబుతున్నవన్నీ శాస్త్రవేత్తలు చెప్పవలసి వస్తుంది. పరిణామ క్రమము అనే ఆలోచనలను పక్కన పెట్టె రోజులు వచ్చేశాయి. ఇప్పుడు మానవుల ఆలోచన సరైన దిశలో ప్రయాణిస్తుంది. ఈ గ్రహం మనది కాదు.

“HUMANS ARE NOT FROM EARTH”

*A SCIENTIFIC EVALUATION OF THE EVIDENCE*

By Dr. Ellis Silver PhD


Thursday, November 26, 2015

భారత దేశం సెక్యులర్ దేశం


భారత దేశం సెక్యులర్ దేశం:

నేడు సెక్యులరిజం కు వ్యతిరేకంగా  అధికారంలో ఉన్నవారు వ్యవహరిస్తున్నరు.

నాయాకులు పోటి పడి మరీ కుల, మతపరమైన కార్యాక్రమాలకు హాజరవుతున్నారు.

అంతేనా అనుకుంటే కుల, మత కార్యాక్రమానికి వెళ్ళిన వారి భాష, యాస, పద్దతులు పాటిస్తూ వారికి ప్రభుత్వ ఖజానా నుండి  లాంచనాలు    ప్రకటించడం పండుగలను అధికారికంగా జరపడం అలవాటయిపోయింది.

మతం అనేది వ్యక్తీగత విషయం

ప్రభుత్వం కాని ప్రభుత్వం తరఫు వారు కాని తల దూర్చడం ఎంతవరకు సంజసమో?

ఇది మతాల వారిగా ప్రోత్సహించడం కాదా.?

ప్రభుత్వ కట్టడాలు మొదలు పెట్టినప్పుడు పూజలు, వాస్తు మరేదో ఎందుకు.?

మరి మేధావులు ఎందుకు మౌనంగా వున్నారో.?

నాయకులు , అధికారులు కుల, మతాలకు అతీతంగా వుంటే రోజు వింటున్న అసహనం అనే పదం కోసం కొడవలూ,  వాదోపవాదాలు జరిగేవే కాదేమో ?

                                                                                   (నేను.. నా ఆలోచనా)