Thursday, June 18, 2020

పది దుల్ హజ్జ్ (హజ్ నెలలో మొదటి పది రోజులు) చేయవలసిన విధులు (పనులు)

 ప్రార్థన  (సలాత్-నమాజ్ ) ఫర్జ్ నమాజ్ కోసం తొందరపడటం మరియు నవాఫిల్‌ను వీలైనంత ఎక్కువగా చదవటం (ప్రార్థించటం) ద్వారా  సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌తో సన్నిహితంగా ఉండటానికి ఉత్తమమైన మార్గం సుగమం అవుతుంది మరియు ముస్తాహాబ్ కూడాను . సోబాన్ (రజిఅల్లాహుతాల ) ఇలా వివరించారు : నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా ఇలా వినడం జరిగింది.  అల్లాహ్ కు తరచూ సజ్దా చేయడం మీ యొక్క విధి, ఎందుకంటే మీరు అల్లాహ్ కు సజ్దా చేస్తే, అల్లాహ్ మిమ్మల్ని ఉన్నత స్థానా లు ప్రసాదించి  మీ  పాపములను  తొలగిస్తాడు. (ముస్లిం)
మరియు ప్రతి సమయంలో ఇలాగే జరుగుతుంది.


ఉపవాసం  (రోజ) ఇది మంచి పనులలో చేర్చబడింది. 
హనీదా బిన్ ఖలీద్ వివరించిన హదీసు ఏమిటంటే,
 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 ధుల్-హిజ్జాలో (హజ్ నెలలో ) తొమ్మిది మరియు అశురా మరియు
 ప్రతి నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.
(అహ్మద్ అబూ దావుద్, నిసాయి ) 

తక్బీర్  (అల్లాహుఅక్బర్), తహెలీల్  (లా ఇలాహా ఇల్లా అల్లాహ్), 
తహ్మిద్  (వలిల్లహిల్ హమ్ద్) వీలైనంత వరకు ఎక్కువగా పఠించాలి.
ఇమామ్ బుఖారీ (రహమతుల్లహి అలయ్) ఇలా అంటా రు:
ధుల్-హిజ్జా యొక్క మొదటి పది రోజులలో, ఇబ్నే ఉమర్ మరియు
 అబూ హురైరా (రజిఅల్లాహుతాల ) బజార్ లో వెళ్లే ప్రతి సారి
తక్బీర్ పఠిస్తూ వెళ్లేవారు , మరియు ప్రజలు తమ తక్బీర్తో పాటు
తక్బీర్ కలిపేవారు (కలిసి పఠించే వారు). మరియు ఇలా కూడా ప్రవచించారు
 ఉమర్ (రజిఅల్లాహుతాల) వారు తన గుడారంలో నుండి బయటికి
 వెళ్ళేటప్పుడు తక్బీర్ పఠనం చేస్తూ బయటికి వెళ్లేవారు. 
అది విని మస్జిదులో ఉన్న వారు మరియు బజారుల లో ఉన్న 
అందరు తక్బీర్ పఠనం చేసే వారు అందరు కలిసి పఠనం 
చేయడం ద్వారా ఆ ప్రాంతమంతయును తక్బీర్ తో మారుమోగేది.
  కాబట్టి, ముస్లింలైన మనం కూడా ఈ యుగంలో వాడుకలో లేని ఈ సున్నత్
 ను పునరుద్ధరించాలి.
 
 
 
 
అరాఫా రోజు ఉపవాసం
'అరాఫా రోజున ఉపవాసం గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 ఇలా అన్నారు: గత సంవత్సరం మరియు రాబోవు సంవత్సరం 

(రెండు సంవత్సరాలు) చేసిన పాపాలను అల్లహ్ క్షమిస్తాడని నేను
 నమ్ముతున్నాను. (ముస్లిం).
 హజ్ చేస్తున్న వ్యక్తికి 'అరాఫా యొక్క ఉపవాసం సిఫారసు చేయబడలేదు, 
ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేస్తున్నప్పుడు 
 అరాఫా రోజున ఉపవాసం చేయలేదు.

No comments:

Post a Comment