రంజాన్ ను ఎల స్వాగతించాలి
- అల్లహ్ తో క్షమాపణ మరియు పాపముల (గున) పై పాశ్చాతాపం.
- ఉపవాసం యొక్క నియమ నిబంధనములను తెలుసుకుంటూ.
- రంజాన్ లో మొత్తం సమయాన్ని మంచి మరియు పుణ్య కార్యములతో గడపడానికి ప్రణాళిక.
- రంజాన్ లో బద్ధకం మరియు సోమరితనానికి దూరంగా వుంటూ, మంచి పనులు మరియు పుణ్య కార్యములకై కష్టపడుతు.
- అల్లహ్ కు ధన్య వాదములు తెలుపుతూ రంజాన్ నెల మనకు లభించినందుకు.
రంజాన్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆచారాలు /ప్రక్రియలు
- రంజాన్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చాలా ఎక్కువగా ప్రార్థనలు చేసే వారు, వీరు దైవ దూత జిబ్రాయిల్ తో కలిసి ఖురాన్ పారాయణం చేసేవారు.
- అల్లాహ్ మార్గం లో ఎక్కువగా ఖర్చు చేసేవారు.
- ప్రజల పట్ల ప్రేమగా / దయగా వుండే వారు.
- ఖురాన్ పారాయణం / చదవటం చేసేవారు ప్రార్థనలు / నమాజ్ ఎక్కువగా చేసేవారు ఎతేకాఫ్ లో కూర్చుండే వారు.
- ఇతర నెలల కంటే ఈ నెలలో ఎక్కవగా ఆరాధన / ఇబాదత్ చేసే వారు.
రంజాన్ లో ఏమి చేయ వలెను
- మరింత ఎక్కువగా ప్రార్థనలు / ఆరాధనలు చేయాలి.
- పాపములకు దూరంగా ఉండాలి.
- 5 పూటల నమాజ్ జమాత్ తో చేయాలి.
- అబద్దాలు మాట్లాడ కూడదు
- ఎవరి గురించి చెడుగా మాట్లా కూడదు / ఎవరికీ చెడు చేయ కూడదు.
- ఎవరికీ మోసం చేయ కూడదు
- మరియు అన్ని రకాల నిషేదించ బడిన (హరామ్) పనులు / మాటలు (చర్యలు/విషయాలు) మానుకోవాలి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు.
హజ్రత్ అబూ హురైరా (రజి) గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లం) వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా ఉపవాసం / రోజా వుంది కూడా అబద్దాలు చెప్పడం, వాటిని అమలు చేయడం వదులుకోకపొతే ఆ వ్యక్తి అన్న పానీయాలు వదిలి పెట్టడం పట్ల దేవునికి / అల్లాహ్ కు ఎలాంటి ఆసక్తి ఉండదు. (సాహి బుఖారి 1242 ఉపవాస ప్రకరణం).
ముఖ్యాంశాలు :
ఉపవాస వ్రతాన్ని పాటించే వారు దాని ఆశయాలను కూడా నెరవేర్చాలని ఈ హదీసు యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపవాసం చేసేవారు ఒక వైపు దైవ ప్రసన్నత కోసం కృషి చేస్తూ, మరో వైపు దైవా గ్రహానికి దారి తీసే అధర్మ కార్య కలాపాలకు కూడా దూరంగా ఉండాలి. లేని పక్షంలో అలాంటి ఉ ఉ పవాసం వుండే వారికి ఎలాంటి పుణ్యం లభించదు. పైగా ఉపవాస స్థితిలో ఉండి కూడా ధర్మ విరుద్ధమైన చేష్టలకు పాల్ప డినందుకు పాపాన్ని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. (వారి ఉపవాసం పట్ల అల్లహ్ కు ఎలాంటి ఆసక్తి ఉండదు) అంటే వారు ఉపవాసాన్ని మానేసి తినటం త్రాగటం మొదలు పెట్టాలని అర్థం ఎంత మాత్రం కాదు. ఇదొక హెచ్చరిక. వారు తమలో దైవ భీతిని పెంపొందించుకొని చెడుకు దూరంగా ఉండాలనేదే దాని ఉద్దేశం.
రంజాన్ యొక్క సద్గుణాలు
- ఇదే నెలలో ఖురాన్ గ్రంథం వెల్లడయ్యింది.
- ఇదే నెలలో జన్నత్ / స్వర్గం యొక్క అన్ని ద్వారాలు తెరవ బడతాయి.
- జహాన్నుమ్ / నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి.
- షైతాన్ / దయ్యం కట్టవేయ బడుతుంది.
- ఇదే నెలలో షబేఖదర్ వుంది ఒక్క రాత్రి వెయ్యి నెలల కన్నా విలువైనది.
- ఎవరైతే సరియైన ఉద్దేశంతో పూర్తీ విశ్వాసంతో ఉపవాసం వుంటారో అతని మునుపటి పాపాలు క్షమించబడతాయి.
- అదేవిధంగా ఈ నెలలో తరావి చదివితే పాపములు క్షమించబడతాయి.
- ఎవరైతే ఈ నెలలో వచ్చే షబేఖదర్ అనే రాత్రి జాగారం/ఇబాదత్ చేస్తారో వారి పాపములు క్షమించబడతాయి.
- ఈ నెలలో చేసే ఉమ్రా ప్రతిఫలం హజ్ కు సమానం.
- ఈ నెలలో చాలా మందికి నరకం నుండి స్వేచ్ఛ లభిస్తుంది.
- ఒక దైవ దూత కేక వేసి చెప్పడం జరుగుతుంది పుణ్య కార్యం / నేకి చేసే వారు ఇంకా ఎక్కువ కష్టపడండి, పాపులారా ఇక మీ పాపములను వదిలెయ్యండి.
- ఉపవాసం ఉండేవారికి అల్లహ్ కృప లభిస్తుంది.
రంజాన్ సందర్భంగా జరిగే కొన్ని తప్పులు
- ఆహారపానీయాల కోహం వృధా ఖర్చులు పెట్టడం.
- రోజంతా పడుకోవడం, రాత్రంతా మేల్కొనడం.
- టీవీ మరియు మొబైల్ కోసం సమయం వృధా చెయ్యడం.
- ఇఫ్తార్ ఆలస్యంగా చేయడం సహర్ తొందరగా చేయడం.
- ఉపవాసం ఉన్నప్పుడు త్వరగా కోపం తెచ్చుకోవడం.
- చేదు ప్రవర్తనను ప్రదర్శించడం.
- రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోక పోవడం.
- తరావి నమాజ్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
- రంజాన్ లో మొదట ఉత్సాహంతో ప్రార్థనలు చేసి నెమ్మదిగా అలసత్వం ప్రదర్శించడం.
- ఫర్జ్ నమాజ్ వదిలేసి పడుకోవడం లేదా జమాత్ తో కాకుండా ఇంట్లో నమాజ్ చేయడం.
No comments:
Post a Comment