Tuesday, March 17, 2020




మానవుడు భుమి పై గ్రహాంతరవాసి...
ఆసక్తి కరమైన పరిశోధన... 
తప్పకుండ చదవండి... 

        డాక్టర్ ఎల్లిస్ సిల్వర్ (P H D) తాను వ్రాసిన Humans are not from earth అనె  పుస్తకం లొ ఒక కొత్త వాదన కు తెర తీయడం జరిగింది. మానవుడు భూమియొక్క నిజమైన నివాసి కాదు బహుశ మానవ జాతి మరొక గ్రహం పై సృష్టించబడి ఏదైన కారణాల వలన తన అసలు గ్రహం నుండి ప్రస్తుత నివాస గ్రహమైన భూమి పై విసిరి వేయబడి ఉండవచ్చు. 

        డాక్టర్ సిల్వర్, ఒక శాస్త్రవేత్తా పరిశోధకుడు మరియు అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుడు తన పదాలు పుస్తకంలో పరిశీలిస్తే ఏ ఒక మతం కు నమ్మకం లేని సైన్సు ఆధారిత పదాలుగా అనిపిస్తుంది.

       డాక్టర్ సిల్వర్, చెప్పిన దాని ప్రకారం మొదటిసారి మానవజాతి సృష్టించబడిన ప్రదేశం చాలా సౌకర్యవంతంగా V.VIP తరహాలో వుండవచ్చు వాతవరణం కూడా చాలా సౌకర్యవంతంగా వుండవచ్చు చాలా మృదువైన మరియు సున్నితమైన వాతావరణంలో నివసించిన వాడు మనిషి చాలా రుచికరమైన రక రకాల భోజనాలు చేయడం చాలా విలాసవంతమైన జీవితం గడపడం అదికూడా కష్టపడకుండ ఆఖరికి తన తిండి కొసం కూడా కష్టపడని జాతి అని తెలుస్తుంది.

బహుశా ఈ జీవి ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు.
తన పొరపాటు వలన సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన వాతావరణం నుండి విసిరివేయబడ్డాడు.
ఎవరైతే అంత మంచి తన స్వంత స్థలం (గ్రహం) నుండి మానవ జాతిని తీసివేశాడొ అతను చాలా శక్తి వంతుడు అయివుండొచ్చు బహుశా ఈ నక్షత్రాలా వ్యవస్థకంటెను బలశాలి అయివుండవచ్చు.
తాను తలచుకుంటే ఎవరినైనా ఎక్కడికైనా ఏ గ్రహం పైన సరే పంపగలడు తాను శిక్షించగలడు అతను జీవులు సృష్టించగలడు అతను మానవులను కూడా సృష్టించగలడు.

      డాక్టర్ సిల్వర్, భూమిని జైలు తో వర్ణిస్తాడు బహుశా ఇక్కడ తప్పు చేసిన వారిని శిక్షించడానికి పంపించి ఉండవచ్చు ఎందుకంటే కొద్దీ మొత్తం భూమి గుండ్రంగా  నీరు. జైలు లాంటి ప్రదేశం మనం ఊహించుకోవచ్చు. అందుకే మానవులను ఇక్కడికి పంపించడం గరిగింది.

    డాక్టర్ సిల్వర్ శాస్త్రవేత్తపరిశీలనల ఫలితాలను పొందిన తరువాత మాత్రమే అభిప్రాయాలను ఏర్పరుస్తాడు. అతని ఈ పుస్తకంలో శాస్త్రీయ వాదనలు చాలా ఉన్నాయి.అతని వాదన యొక్క ప్రధాన అంశాలపై  ఆధారపడిన కొన్ని పాయింట్లు. 

1) భూమి యొక్క గురుత్వాకర్షణకు మరియు మానవులు వచ్చిన ప్రదేశం యొక్క గురుత్వాకర్షణకు మధ్య చాలా తేడా ఉంది.
మానవుడు వచ్చిన గ్రహం యొక్క గురుత్వాకర్షణ భూమి కంటే చాలా తక్కువగా ఉండవచ్చు దీనివల్ల మానవుడికి భారాన్ని మోయడం చాలా సులభం. మానవులలో వెన్నునొప్పి యొక్క ఫిర్యాదు అధిక గురుత్వాకర్షణ కారణంగా ఉంది.

2) మానవులలో కనిపించే దీర్ఘకాలిక వ్యాధులు భూమిపై నివసించే ఇతర జీవులలో లేవు. డాక్టర్ సిల్వర్ చెప్పేది ఏమిటంటే మొత్తం భూమి మీద ఒక్క వ్యాధి కూడా లేని మనిషిని ఎవరైనా చూయించగలరా. ఒకవేళ చూయిస్తే నేను నా వాదనను ఉపసంహరించుకోగలను. ప్రతి జంతువు గురించి నేను మీకు చెప్పగలను, సమయానుకూలమైన మరియు తాత్కాలిక అనారోగ్యాలు తప్ప మరే ఇతర వ్యాధులలో చిక్కుకున్న జంతువు కనిపించవు.


3) ఒక్క మానవుడు కూడా ఎండలో ఎక్కువసేపు కూర్చోలేడు అయితే (తలా తిరగడం) మైకము రావడం మొదలవుతుంది మరియు సన్ స్ట్రోక్‌తో బాధపడవచ్చు. జంతువులలో అలాంటి సమస్యలు వుండవు.
జంతువులు ఎండలో నెలల తరబడి ఉన్నప్పటికీ ఎటువంటి తక్షణ అనారోగ్య సమస్యలతో బాధపడవు.

4) ప్రతి మనిషి నా ఇల్లు ఈ గ్రహం పై లేదు అనే భావనతోనే ఉంటాడు, కొన్ని సార్లు తనకు తెలియకుండానే ఎదో విచారంలో విదేశాలలో నివసిస్తున్న విదేశీయుడిలా ఉంటాడు తన సొంత ఇంట్లో  
రక్త సంభందీకులతో కూర్చున్నప్పటికినీ.


5) భూమిపై ఉన్న అన్ని జీవుల టెంపరేచర్ స్వయంచాలకంగా ప్రతి సెకనులో నియంత్రించబడుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ వేడికి అనుగుణంగా వారి శరీర ఉష్ణోగ్రత స్వయంచాలకంగా పెరుగుతుంది.
ఒకవేళ వెంటనే అదే సమయంలో మేఘాలు వస్తే అప్పుడు వారి శరీర ఉష్ణోగ్రత చల్లగా అయిపోతుంది అంటే మనిషి తప్ప అన్ని జీవులు శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకుంటాయి. మానవులలో అలాంటి వ్యవస్థ లేదు, మారుతున్న వాతావరణంతో పాటు మనిషి అనారోగ్యానికి గురవుతాడు.వాతవరణ మార్పు వల్ల వచ్చే జ్వరం, జలుబు మానవులలో మాత్రమే ఉంటుంది.



6) మనిషి ఈ గ్రహం మీద కనిపించే ఇతర జీవుల నుండి చాలా భిన్నంగా ఉంటాడు.మానవుడి DNA మరియు జన్యువుల సంఖ్య ఈ గ్రహం లోని ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మానవులను సృష్టించిన అసలు గ్రహం భూమి వంటి మురికి వాతావరణాన్ని కలిగి లేదు అని మరియు మనిషి యొక్క చర్మము మెత్తగా మరియు నాజుకుగా ఉండడం ఎండకు మారిపోవాడం గమనిస్తే మానవుని చర్మమం జన్మ గ్రహం ప్రకారం పరిపూర్ణంగా తయారైంది అని అర్థమవుతుంది. మానవ జాతి చాలా సున్నితమైనది, భూమికి వచ్చిన తరువాత కూడా, దానికి అనుగుణంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. తన జన్మ గ్రహం మీద సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవితం గడిపినట్టు ఇక్కడ భూమిపైకి వచ్చిన తరువాత సాధ్యమైనంతవరకు విలాసవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగంటే సుతిమెత్తని
విలాసవంతమైన మంచాలు పరుపులు, అందమైన మరియు బలమైన రాజభవనాలు (ఇళ్ళు) ఇప్పటికి అల్లాగే జన్మ గ్రహం ప్రకారం పరిపూర్ణంగా నిర్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇతర
జంతువులు మరియు జీవాలు ఇలా విలాసవంతంగా ఉండటానికి ప్రయత్నం చేయవు. ఇక్కడ భూమి యొక్క జీవులకు తెలివి అనేది లేదు అవి మంచిగా ఆలోచించలేవు మంచిగా ఉండను లేవూ. మనిషి లాగా శాంతి యుతంగా జీవించాలని కోరుకోవు. మనిషి కూడా వాటిని చూసే క్రూరత్వం అనేది నేర్చుకున్నాడు. ప్రేమ, శాంతి, సామరస్యం అనేది అసలు మానవుని లక్షణం. మానవుడు ఒక ఖైదీ లాంటి వాడు భూమి పైన అందుకే ఎలాంటి సౌకర్యాలు లేని ఒక గ్రాహం పైన శిక్ష అనుభంచడానికి  పంపించబడ్డాడు.

డాక్టర్ సిల్వర్ అభిపాయం ప్రకారం ఈ (మానవుని) గ్రహాంతర వాసి యొక్క  తెలివి మరియు పరిపక్వత ను గమనిస్తే తెలుస్తుంది తాను తన తల్లి దండ్రులను విడిచి ఇంకా ఎక్కువ కాలం కాలేదు. బహుశా కొన్ని వేళా సంవత్సరములు మాత్రమే అయి ఉంటుంది అందుకే తన పాత గ్రాహం లాగే ఇక్కడ కూడా విలాసవంతంగా జీవించాలనుకుంటున్నాడు మనిషి. అందులో భాగంగానే వాహనాలను కనుగొన్నాడు ఫోన్లు మరెన్నో విలాసవంతమైనవి, ఒకవేళా మానవ జాతి ఈ గ్రాహం పై
 వచ్చి కొన్ని లక్షల సంవత్సరాలు అయి ఉంటే ఇవి కొన్ని వేళా సంవత్రాల ముందే కనుకొనేవాడు మనిషి.
ఎందుకంటే మీరు మరియు నేను చాలా మిలియన్ల సంవత్సరాల నుండి పేలవంగా మరియు జంతువుల వలె జీవించలేదు. ఎందుకంటే మీరు మరియు నేను చాలా మిలియన్ల సంవత్సరాల నుండి  పేలవంగా మరియు జంతువుల వలె జీవించలేము.  డాక్టర్ ఎలియాస్ సిల్వర్ యొక్క పుస్తకం లో ఇలాంటి విషయాలు  చాలా వున్నాయి  మరీ  ముఖ్యంగా అతని వాదనలు అబద్ధమని ఇంకా నిరూపించబడలేదు. నేను ఈ పుస్తకం యొక్క శాస్త్రీయ వాదనలు మరియు
ఆలోచనలను గురించి గమనిస్తునంత సేపు ఈ కథ చెబుతున్నది ఒక శాస్త్రవేత్త అసలు ఇది కథ కాదు నిజమే కదా అనిపించింది. ప్రతి మతం లోని ప్రేరణాత్మక పుస్తకం వివరించేది ఇదే కదా అనిపించింది. తండ్రి ఆడమ్ అండ్ ఈవ్ కథ మన అందరికీ తెలుసు కాబట్టి నేను దానిపై వివరణ రాయ దలుచుకోలేదు.ప్రవక్తలు తమ తరాలకు
చెబుతున్నవన్నీ శాస్త్రవేత్తలు చెప్పవలసి వస్తుంది. పరిణామ క్రమము అనే ఆలోచనలను పక్కన పెట్టె రోజులు వచ్చేశాయి. ఇప్పుడు మానవుల ఆలోచన సరైన దిశలో ప్రయాణిస్తుంది. ఈ గ్రహం మనది కాదు.

“HUMANS ARE NOT FROM EARTH”

*A SCIENTIFIC EVALUATION OF THE EVIDENCE*

By Dr. Ellis Silver PhD